
ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో శాశ్వత శాంతి లక్షంగా
ఇస్లామాబాద్‌లో జరగనున్న చర్చలు అమెరికా బృందానికి వాన్స్ నాయకత్వం
ఇస్లామాబాద్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు కీలకమైన అమెరికా-ఇరాన్ ముఖాముఖి చర్చలకు పాకిస్తాన్ వేదికగా నిలవనుంది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఈ చర్చలు శుక్రవారం జరగనున్నాయి. ఈ సమావేశాల లక్ష్యం తాత్కాలిక విరమణను స్థిరమైన శాంతి ఒప్పందంగా మార్చడమే. ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ ప్రతినిధి బృందం గురువారం రాత్రికి ఇస్లామాబాద్ చేరుకోనుందని పాకిస్తాన్‌లోని ఇరాన్ రా యబారి రెజా అమిరి మొఘద్దాం తెలిపారు. అయితే ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఇరాన్ ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. అ యినప్పటికీ పాకిస్తాన్ ప్రధాని షెహబా షరీఫ్ ఆహ్వానం మేరకు ఇరాన్ చర్చలకు హాజరవుతున్నట్లు చెప్పారు.
అమెరికా ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహించనున్నట్లు సమాచారం. ఆయనతో పాటు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే వారి రాక సమయంపై ఇంకా స్పష్టత లేదు.
దీర్ఘకాలిక శాంతిపై దృష్టి
ఈ చర్చలు శాశ్వత శాంతి కోసం విసృ్తత చట్రాన్ని రూపొందించడంపై కేంద్రీకృతమవుతాయని సమాచారం. ఆంక్షల సడలింపు, ప్రాంతీ య భద్రత, ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాల భవిష్యత్తు వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్ర ణాళిక ఆధారంగా చర్చలు సాగనున్నాయి. ఇం దులో ఆంక్షల ఎత్తివేత, భవిష్యత్ దాడులపై హా మీలు, హార్మూజ్ జలసంధికి సంబంధించిన ఏ ర్పాట్లు వంటి అంశాలు ఉన్నాయి. శాంతి ప్రయత్నాల మధ్య అమెరికాఇరాన్ మధ్య అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా లెబనాన్‌లో కాల్పుల విరమణ ఉల్లంఘనలపై వచ్చిన నివేదికలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. గతంలో చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో ఇరాన్ మరింత అప్రమత్తంగా ఉంది.
పాకిస్తాన్ రాజనీతి
ఈ వివాదంలో పాకిస్తాన్ అనూహ్యంగా మధ్యవర్తిగా మారి కీలక పాత్ర పోషిస్తోంది. శాంతి చర్చ లు విజయవంతం కావడానికి పాకిస్తాన్ ప్రధాని షెహబా షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, విదేశాంగమంత్రి ఇషాక్‌దార్ విసృ్తత స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇషాక్‌దార్ ఇప్పటికే సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, కెన డా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, కువైట్ వి దేశాంగ మంత్రి జర్రాహ్ జాబెర్ అల్ సబాహ్‌లతో సంప్రదింపులు జరిపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
ఈ కీలక చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో గురువారం, శుక్రవారం స్థానిక సెలవులు ప్రకటించారు. విదేశీ ప్రతినిధుల రాక, నివాసానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ, పాకిస్తాన్‌లోని అమెరికా రాయబారి నటా లీ బేకర్‌తో సమావేశమై, అన్ని విదేశీ ప్రతినిధులకు పటిష్ట భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అమెరికా ప్రతినిధులను ప్రత్యేక అతిథులుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చర్చల ఫ లితం పశ్చిమ ఆసియా భద్రత, ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ రాజనీతిపై గణనీయ ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.