Reading Time: < 1 minute
Vayuputra Movie Budget Issues Chandoo Mondeti Nagavamsi On Hold

‘కార్తికేయ 2’ వంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు చందూ మొండేటి, ప్రొడ్యూసర్ నాగవంశీ కాంబినేషన్‌లో ప్రకటించిన ‘వాయుపుత్ర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇప్పుడు ఈ విజువల్ వండర్‌కు బడ్జెట్ సమస్యలు అడ్డుపడుతున్నట్లు ఫిల్మ్ నగర్ నుంచి షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది రీసెంట్‌గా వచ్చిన ‘మహావతార్ నరసింహ’ సూపర్ హిట్ అవ్వడంతో, యానిమేషన్ బ్యాక్‌డ్రాప్‌లో హనుమంతుని కథతో ‘వాయుపుత్ర’ను పట్టాలెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ ఈ సినిమా మేకింగ్ కోసం సుమారు రూ. 50 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కేవలం యానిమేషన్, గ్రాఫిక్స్ కోసమే భారీగా వెచ్చించాల్సి రావడంతో నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు.

Also Read:Vishwambhara: రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో విజువల్ వండర్ వచ్చేదప్పుడే!

ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు నెట్‌ఫ్లిక్స్ కేవలం రూ. 15 నుంచి 20 కోట్లు మాత్రమే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్‌లో ఇది సగం కూడా లేకపోవడంతో, మిగిలిన మొత్తాన్ని కేవలం థియేట్రికల్ వసూళ్లపైనే ఆధారపడి రిస్క్ చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమని నాగవంశీ భావిస్తున్నారట. థియేట్రికల్ మార్కెట్ అస్థిరంగా ఉన్న ఈ తరుణంలో ఇంత పెద్ద మొత్తాన్ని జూదంలా పెట్టడం ఇష్టం లేక, ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ను ‘హోల్డ్’లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు నిర్మాత నాగవంశీ గానీ, ఇటు దర్శకుడు చందూ మొండేటి గానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.