Reading Time: < 1 minute
India Gdp Growth Forecast 2026 27 World Bank Report

2026-27 ఆర్థిక సంవత్సరంలో (FY27) భారత ఆర్థిక వృద్ధి 6.6 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. బలమైన దేశీయ డిమాండ్ , ఎగుమతుల కారణంగా FY25లో 7.1 శాతంగా ఉన్న వృద్ధి, FY26 నాటికి 7.6 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. అయితే.. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా వృద్ధి రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఆహారం, ఇంధన ధరల పెరుగుదల , రూపాయి విలువ క్షీణత వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.9 శాతంగా ఉండవచ్చు. GST రేట్ల తగ్గింపు వినియోగదారుల డిమాండ్‌ను పెంచినప్పటికీ.. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలు గృహాల ఆదాయంపై ప్రభావం చూపుతాయని నివేదిక తెలిపింది.

Also Read:Nursing Jobs : తెలంగాణ ఆరోగ్య శాఖలో కొలువుల జాతర..

మూడీస్ రేటింగ్స్ భారత వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. పశ్చిమ ఆసియా (West Asia) వివాదం, ఇంధన లభ్యతపై ఆందోళనల కారణంగా FY27లో వృద్ధి 6.5 శాతానికి పరిమితం కావచ్చని ICRA పేర్కొంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన మార్కెట్లో అంతరాయాలు భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారాయి. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా పశ్చిమ ఆసియా సంఘర్షణలు భారత వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని.. రవాణా, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ.. భారీ విదేశీ మారక నిల్వలు, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ వంటి అంశాలు ఈ నష్టాలను ఎదుర్కోవడంలో భారత్‌కు అండగా నిలుస్తాయని ప్రపంచ బ్యాంక్ విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరఫరా గొలుసులను రక్షించడంలో సహాయపడతాయని గవర్నర్ పేర్కొన్నారు.