Reading Time: < 1 minute
Whats Today On 9th April 2025 2

* ఐపీఎల్‌: నేడు రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు.. గౌహతి వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌

* ఢిల్లీ: నేటి నుంచి టోల్‌ గేట్ల దగ్గర నగదు చెల్లింపులు రద్దు.. ఫాస్టాగ్‌ లేదా UPI ద్వారా మాత్రమే చెల్లింపు

* ఢిల్లీ: నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం.. ఇందిరా భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు CWC సమావేశం.. హాజరుకానున్న కాంగ్రెస్‌ పాలిత మూడు రాష్ట్రాల సీఎంలు.. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ, నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ, నిన్న జరిగిన కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికలతో పాటు బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై సమీక్ష

* తూర్పుగోదావరి జిల్లాలో నేడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పర్యటన.. ఆదికవి నన్నయ యూనివర్సిటీకు చేరుకుని, 11.00 నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు నిర్వహించే XVI & XVII సంయుక్త కన్వొకేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

* ఇవాళ ఉదయం 10 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి.. CWC సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్

* ఇవాళ ఏపీ కేబినెట్‌ సమావేశం.. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో కేబినెట్‌ భేటీ.. అమరావతి చట్టం ఆమోదంతో ప్రధాని, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం.. 16వ SIPBలో చర్చించిన పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న కేబినెట్

* జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణంలో పర్యటించనున్న మంత్రి అడ్లూరి లక్మణ్ కుమార్ .. వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్న మంత్రి

* కర్నూలు: నేటి నుండి గూడూరు శ్రీ తిమ్మగురుడు స్వామి తిరునాళ్ల మహోత్సవాలు ప్రారంభం

* హైదరాబాద్‌: గచ్చిబౌళి స్టేడియంలో‌యోగా సెషన్.. పాల్గొన్న మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్..

* అనంతపురం : రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైసిపి పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.