Reading Time: < 1 minute

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

Caption of Image.
  • జూన్‌‌‌‌‌‌‌‌ 2 నుంచి సర్కార్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లకు అల్పాహారం
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర/ఎర్రుపాలెం, వెలుగు : విద్యతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. స్టూడెంట్లు అర్ధాకలితో బడికి పోవద్దన్న ఉద్దేశంతోనే జూన్‌‌‌‌‌‌‌‌ 2 నుంచి రాష్ట్రంలోని 20 లక్షల మంది స్టూడెంట్లకు అల్పాహారం అందించేందుకు నిర్ణయించామన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు, ఎర్రుపాలెంలోని స్టూడెంట్లకు గురువారం అమ్మ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ… వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లకు సైతం మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు చెప్పారు. విద్యారంగానికి ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేస్తోందని, విద్యార్థులను అద్భుతమైన మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో ఒకే సారి 100 యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ స్కూల్స్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్నామని, ఒక్కో స్కూల్‌‌‌‌‌‌‌‌ రూ.100 కోట్లతో 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మితం అవుతాయన్నారు. వీటితో పాటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119  తెలంగాణ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ స్కూల్స్‌‌‌‌‌‌‌‌ సైతం ప్రారంభించనున్టన్లు చెప్పారు. సర్కార్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లలో ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఎర్రుపాలెం మండలంలోని కట్టలేరు మొదటి దశ అభివృద్ధి పనులకు 2013 – -14లో రూ.35 కోట్లు మంజూరైనా అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం నిధులు ఇవ్వక పనులు జరగలేదని విమర్శించారు.

రెండో దశ రిపేర్ల కోసం రూ.36 కోట్లు మంజూరు చేశామని, కుడి, ఎడమ కాల్వల పూడికతీత, లైనింగ్‌‌‌‌‌‌‌‌ పనులు చేపడుతున్నామని చెప్పారు. అనంతరం మధిరలో రూ.48 లక్షలతో కట్టిన విద్యుత్‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నాయుడు సత్యనారాయణ, మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బండారు నరసింహారావు, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అనుదీప్‌‌‌‌‌‌‌‌ దురిశెట్టి, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీజ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.