
తెలంగాణ సామాజిక నేపథ్యం తో రాబోతున్న చిత్రం ‘సర్కార్ బాయి’. శ్రీరామ్ నిమ్మల , సాయి కీర్తన హీరోహీరోయిన్లుగా, లారా దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కార్ బాయి’ చిత్రానికి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ముహూర్తం కార్యక్రమంలో భాగంగా నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు లారా సీన్ డైరెక్షన్ చేశారు. ముహూర్తం షాట్‌ను తెలంగాణ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి దాస్య నాయక్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు లారా మాట్లాడుతూ..1985 సంవత్సరంలో జరిగిన నీటి సంఘటనలు, కుల వివక్షత వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని మూవీ యూనిట్ వ్యక్తం చేసింది. ప్రేక్షకులు ఈ సామాజిక కథాంశంతో వచ్చే చిత్రాన్ని ఆదరించాలని డైరెక్టర్ కోరారు. ప్రముఖ దర్శకులు ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో భాగంగా వచ్చే సినిమాలను ఆదరించాలని ఆయన తెలిపారు.