Reading Time: < 1 minute

హైదరాబాద్ సిటీలో 13 వందల మంది రౌడీషీటర్లు : 200 మందికి డ్రగ్స్ పాజిటివ్

Caption of Image.

హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు  డ్రగ్ ఫ్రీ సిటీ లక్ష్యంగా పోలీసులు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా నేర చరిత్ర ఉన్న రౌడీషీటర్ల అలవాట్లపై దృష్టి సారించారు. సిటీలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లను పిలిపించి, వారికి ఆకస్మికంగా డ్రగ్ టెస్టులు నిర్వహించారుఈగల్ టీం,టాస్క్ ఫోర్స్  పోలీసులు. ప్రతి నలుగురిలో ముగ్గురు డ్రగ్స్ వాడుతున్నట్లు తెలిసి షాక్ అయ్యారు. వీరిలో ఎక్కువ మంది గంజాయి సేవిస్తున్నట్లుగా గుర్తించారు. ఇంత పకడ్బందీగా చర్యలు చేపట్టినా వీరికి గంజాయి, తదితర డ్రగ్స్ ఎక్కడినుంచి వస్తున్నాయనే కోణంలో విచారణ చేపట్టారు.. వివరాల్లోకి వెళితే.. 

హైదరాబాద్ లో పోలీసులు కీలక ఆపరేషన్ నిర్వహించారు. సిటీలోని  రౌడీ షీటర్లకు డ్రగ్ పరీక్షలు చేశారు  సిటీ వ్యాప్తంగా 1300 మంది రౌడీ షీటర్లను గుర్తించిన పోలీసులు.. వారిలో 250 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయించగా  190 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.  వీరిలో ఎక్కువగా గంజాయికి అలవాటు పడినట్లు గుర్తించారు. 

డ్రగ్ టెస్ట్ ఫలితాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేశాయి. పరీక్షలు చేయించిన ప్రతి నలుగురిలో ముగ్గురు డ్రగ్స్ వాడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. వీరంతా ప్రధానంగా గంజాయికి బానిసలయ్యారని, ఆ  క్షణాల్లోనే గొడవలు, దాడులు ,ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు నిర్ధారించారు. కేవలం వినియోగదారులను పట్టుకోవడమే కాకుండా, ఈ గంజాయి నెట్‌వర్క్ మూలాలను గుర్తించి నిర్మూలించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశంగా పోలీసులు చెబుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.