Reading Time: < 1 minute

2 వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

Caption of Image.

నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడలో 2 వేల లీడర్ల బెల్లం పానకం, 70 లీడర్ల గుడుంబాను పోలీసులు ధ్వంసం చేశారు. జైపూర్ ​ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్​ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 బైక్​లు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని గుడుంబా ప్రభావిత ప్రాంతాల్లో సోదాలు చేపట్టి 2వేల లీటర్ల బెల్లం పానకం, 70 లీడర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. తయారు చేస్తున్న, అమ్ముతున్న ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. సీఐలు బన్సీలాల్, ఆర్.కృష్ణ, ఎస్సైలు సుబ్బారావు, రాజశేఖర్, జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

66 బైక్​లు స్వాధీనం

జైపూర్, వెలుగు: ప్రజల భద్రతకోసం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహిస్తున్నట్లు జైపూర్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. గురువారం ఎస్సై రాజశేకర్ , సిబ్బంది తో కలిసి మండలంలోని రామారావుపేటలో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 66 బైక్​లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

©️ VIL Media Pvt Ltd.