Reading Time: 2 minutes

ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప్రమాద సమయంలో హీరో ఎక్కడ ఉన్నారంటే?

Caption of Image.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘స్పిరిట్’.  ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్ లో  అనూహ్యంగా అగ్రిప్రమాదం చోటు చేసుకుంది.  దీంతో అభిమానుల్లో తీవ్ర అందోళన నెలకొంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న  ఈ మూవీ షూటింగ్ లో ఈ ఘటన టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగింది?

హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న ‘స్పిరిట్’ షూటింగ్ సెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సెట్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లు, ఖరీదైన షూటింగ్ పరికరాలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో చిత్ర బృందానికి చెందిన ఒక టెక్నీషియన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన యూనిట్ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్ సెట్‌లో లేకపోవడం అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. గత కొద్ది రోజులుగా ప్రభాస్ అవసరం లేని కొన్ని కీలక సన్నివేశాలను సందీప్ రెడ్డి వంగా చిత్రీకరిస్తున్నారు.

వైరల్ అవుతున్న ప్రభాస్ – సందీప్ ఫోటోలు

రీసెంట్‌గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో  ప్రభాస్  కలిసి హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాను వీక్షించారు. థియేటర్ నుంచి బయటకు వస్తున్న వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్ ఎన్నడూ చూడని విధంగా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు.  ఇప్పటికే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుండగా, హీరోయిన్‌గా తృప్తి డిమ్రి నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

మరోవైపు ‘ఫౌజీ’ సందడి..

ప్రభాస్ ‘స్పిరిట్’ తో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే పీరియడ్ వార్ డ్రామాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయింది. ఈ ఏడాది దసరా కానుకగా ‘ఫౌజీ’ థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా, చిన్నపాటి అగ్నిప్రమాదం జరిగినప్పటికీ ‘స్పిరిట్’ టీమ్ ఏమాత్రం తగ్గకుండా తిరిగి షూటింగ్‌ను పునఃప్రారంభించడానికి సిద్ధమవుతోంది. సందీప్ వంగా మార్క్ యాక్షన్, ప్రభాస్ రేంజ్ కటౌట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 

 

©️ VIL Media Pvt Ltd.