Reading Time: 2 minutes
Dehydration Symptoms Prevention Summer Health Tips

Dehydration Symptoms & Prevention Tips: ఎండలు మండుతున్నాయి. బయట భానుడి భగ భగలకు జనాలు తల్లడిస్తున్నారు. ఈ వేసివిలో తరచూ మనల్ని వేధించే సమస్య డీ హైడ్రేషన్. ప్రస్తుత జీవన విధానంలో బిజీ షెడ్యూల్ కారణంగా మనిషి శరీరానికి సరిపడా నీటిని తీసుకోవడం మరిచిపోతున్నాడు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల వరకు నీటిని తాగాలి. కానీ ఇలా చేయకపోవడంతో మనిషి డీహైడ్రేట్‌గా మారిపోతున్నాడు. తద్వారా కష్టాల బారిన పడుతున్నాడు. ఈ ఎండా కాలంలోనూ నీళ్లు తక్కువగా తీసుకుంటున్నారు. కొందరు ఎప్పుడూ ఏపీలోనే ఉంటాం. మీకు ఎక్కువగా నీళ్లు తాగాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ.. ఇది తప్పు. ఎండలో తిరగకపోయినా నీళ్లు తాగుతూ ఉండాలి. అంతేకాదు.. ఒకవేళ మీరు డీహైడ్రేషన్‌కు గురైతే మీ హైడ్రేషన్ స్థాయిలను పెంచుకునేందుకు మీరు తక్షణం చర్యలు తీసుకోవడం ప్రారంభించాలి. ఎందుకంటే రోజు మీరు తీసుకునే నీటి పరిమాణం అనేది మీ శరీరం తీరు, మీ ఆరోగ్య పరిస్థితులు, మీరు వాడే మెడిసిన్స్, ఇతర కారకాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీరు నిత్యం హైడ్రేట్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే నీరు శరీర రక్త ప్రసరణ, శరీర ఉష్ణోగ్రత, జీర్ణక్రియ, పోషకాల బదిలీతో పాటు అనేక జీవరసాయన ప్రతిచర్యలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది.

READ MORE: Curd Upma Recipe: మండే ఎండల్లో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

డీహైడ్రేషన్ లక్షణాలు ఎలా ఉంటాయి?
కడుపునొప్పితో సమస్య ప్రారంభమవుతుంది. గంట వ్యవధిలో రెండు , మూడు సార్లు నీళ్ల విరోచనాలు అవుతాయి. కొందరిలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కడుపునొప్పి, విరోచనాలకు తోడుగా వాంతులు కూడా అవుతాయి. ఏమి తిన్నా, నీళ్లు తాగినా వెంటనే విరోచనం అవుతుంది. శరీరంలోని లవణాలు, సూక్ష్మపోషకాలు నష్టపోవాల్సి వస్తుంది. నోటిలో , నాలుక మీద తేమ తగ్గి పొడిగా మారుతుంది. నీరం ఎక్కువగా ఉండి కొన్ని సందర్భాలలో స్పృహ కోల్పోతారు.

READ MORE: Xiaomi TV S Mini LED 2026: షియోమీ 100 అంగుళాల స్క్రీన్స్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో.. కొత్త 4K స్మార్ట్ టీవీలు విడుదల

డీహైడ్రేషన్ రాకుండా ఉండాలంటే ఇవి పాటించండి..
డీహైడ్రేషన్ రాకుండా ఉండాలంటే, దాహం వేసే వరకు ఆగకుండా రోజంతా క్రమం తప్పకుండా నీరు త్రాగాలి. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు, అలాగే పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఎండలో వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవడం, కాఫీ, టీ, ఆల్కహాల్‌ను తగ్గించడం ఉత్తమం. విపరీతమైన చెమట పట్టినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు, కేవలం నీరే కాకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, లేదా ఓ.ఆర్.ఎస్ (ORS) వంటివి తీసుకోవడం మంచిది. చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కాఫీ, టీలకు దూరంగా ఉండటం మంచిది. ఇవి డీహైడ్రేషన్‌ను పెంచవచ్చు. మీ మూత్రం రంగు తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉంటే మీరు హైడ్రేటెడ్‌గా ఉన్నారని అర్థం. ముదురు పసుపు రంగులో ఉంటే, వెంటనే ఎక్కువ నీరు తాగాలి. ఎండలో పనిచేసేవారు, ఎక్కువ వ్యాయామం చేసేవారు సాధారణం కంటే ఎక్కువ నీరు, ద్రవ పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి.