అష్టమ శని జాతకంలో ఉంటే వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే జన్మ రాశి నుంచి ఎనిమిదవ రాశి స్థానంలో శని గ్రహం సంచరిస్తే దానిని అష్టమ శని అంటారు. అయితే ఇప్పుడు ఏ రాశిలో అష్టమ శని ప్రభావం ఉందో చూద్దాం.
కన్యా రాశి వారిపై, కుంభ రాశి వారిపై,మీన రాశివారిపై అష్టమ శని ప్రభావం ఉంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం వలన ఈ రాశి వారు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కుంటారు. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవక పోవడం, అప్పలు బాధలు ఎక్కువ అవ్వడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట.
అంతే కాకుండా మానసిక ప్రశాంతత దెబ్బ తింటుంది. వ్యాపారంలో , ఉద్యోగంలో ఒత్తిడి అధికం అవుతంది. ఏ పని చేసినా కలిసి రాదు, ఒకటి అనుకుంటే మరొక సమస్య ఎదురు అవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి జాబ్ పోయే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉన్నదంట. అందువలన అష్టమ శని ఉన్న సమయంలో ఆచీ తూచి అడుగు వేయడం మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించడం, కొత్తగా వ్యాపారం ప్రారంభించడం వంటిది చేయడం అస్సలే మంచిది కాదంట. దీని వలన అనేక విధాలుగా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువగా నష్టపోతారంట. అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు హెచ్చరిస్తున్నారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




