Reading Time: < 1 minute
Orion Toilet Problem On Artemis Ii Mission 23 Million Uwms Clogs

చంద్రుడి చుట్టూ విజయవంతమైన ప్రయాణం తర్వాత, ఓరియన్ అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి వస్తున్న ప్రయాణం అంతా సాఫీగా సాగుతోంది. కానీ $23 మిలియన్ల(రూ.192 కోట్లు) టాయిలెట్ మాత్రం అడ్డంకులు ఎదుర్కొంటోంది. అది క్లాగ్ అయింది. నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో ఓరియన్ అంతరిక్ష నౌకలో ఉన్న యూనివర్సల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (UWMS) అని పిలవబడే ఈ అధునాతన టాయిలెట్, జీరో గ్రావిటీలో పని చేయడానికి రూపొందించబడింది. ఇది సుమారు $23 మిలియన్ల ఖర్చుతో అభివృద్ధి చేశారు. ఇది టైటానియం నుండి 3D ప్రింట్ చేశారు. మునుపటి అంతరిక్ష టాయిలెట్ల కంటే మెరుగైనది.

Also Read:Pakistan Demands Nobel Peace Prize: షాబాజ్ షరీఫ్, మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. పాకిస్తానీల వింత డిమాండ్‌..

ప్రయాణం ప్రారంభం నుండి ఈ టాయిలెట్‌కు సమస్యలు ఎదురయ్యాయి. లాంచ్ తర్వాత కొద్ది గంటల్లోనే యూరిన్ కలెక్షన్ ఫ్యాన్ జామ్ అయింది. తర్వాత వేస్ట్ వాటర్ వెంట్ లైన్‌లో ఫ్రీజ్ అయిన యూరిన్ కారణంగా క్లాగ్ ఏర్పడింది. ఒకసారి బర్నింగ్ స్మెల్ కూడా వచ్చింది. అంతరిక్ష వాతావరణంలో యూరిన్ ఫ్రీజ్ అవడం వల్ల వెంట్ లైన్ బ్లాక్ అయింది. దీన్ని పరిష్కరించడానికి ఓరియన్ నౌకను తిప్పి, సూర్యకిరణాలు నేరుగా వెంట్ లైన్‌పై పడేలా చేశారు. ఇది కొంతవరకు సహాయపడింది, కానీ పూర్తిగా క్లాగ్ తొలగలేదు.

Also Read:Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు

ఇప్పుడు ఆస్ట్రోనాట్లు కొన్ని సందర్భాల్లో కొలాప్సిబుల్ కంటింజెన్సీ యూరినల్స్ (ప్లాస్టిక్ బ్యాగులు) వాడుతున్నారు. అయినప్పటికీ, సాలిడ్ వేస్ట్ (పూప్) కోసం టాయిలెట్ సాధారణంగా పని చేస్తోంది. నాసా ఇంజనీర్లు గ్రౌండ్ నుండి ట్రబుల్‌షూట్ చేస్తున్నారు. టాయిలెట్‌ను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్య ఉన్నప్పటికీ, మిషన్ మొత్తం సాఫీగా సాగుతోంది. ఆర్టెమిస్ II యాస్ట్రోనాట్లు (రీడ్ వైస్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్) చంద్రుడి చుట్టూ విజయవంతంగా తిరిగి, ఇప్పుడు భూమి వైపు పయనమైంది.