
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ నటుడు ఎం. మోహన్ బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తిరుపతి పోలీసులను ఎపి హైకోర్టు ఆదేశించింది. విద్యార్థి నాయకుడి కిడ్నాప్‌నకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై నమోదైన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎపి హైకోర్టులో మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ నిర్వహించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఈ మేరకు పోలీసులను ఆదేశించింది. కేసు సిడిని తమ ముందు ఉంచాలని పోలీసులకు కోర్టు స్పష్టం చేసింది.
కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి సమీపంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూళ్లు చేస్తుం దంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సదరు యూనివర్సిటీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాలు నేతలు ఆందోళనకు పిలుపు నిచ్చారు. దీంతో విద్యార్థి సంఘం నేతలు వినోద్, అక్బర్లను మోహన్‌బాబు యూనివర్సిటీకి చెందిన బోన్సర్లు బలవంతంగా ఎత్తుకెళ్లా రు.
ఈ నేపథ్యంలో మరో విద్యార్థి సంఘం నేత తిరుపతి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థి సంఘం నేతల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలను పోలీసులు రక్షించారు. బౌన్సర్ల తోపాటు వారి వాహనాలను తిరుపతి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద పోలీ సులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి తొలి వారంలో చోటు చేసుకుంది.