Reading Time: < 1 minute

రూ. 10 వేలు తీసుకుంటూ చిక్కిన ఆర్‌‌‌‌‌‌‌‌ఐ

Caption of Image.
  • ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ కోసం లంచం డిమాండ్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు : భూమి ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ చేసేందుకు లంచం తీసుకున్న ఆర్‌‌‌‌‌‌‌‌ఐని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌‌‌‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఏసీబీ డీఎస్పీ విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం… పెద్దపల్లి జిల్లా రాయదండి గ్రామానికి చెందిన వెంకటస్వామి తన భూమి ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ కోసం అంతర్గాం రెవెన్యూ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ శ్రీమాన్‌‌‌‌‌‌‌‌ను కలిశారు. పని పూర్తి చేసేందుకు రూ. 10 వేలు ఇవ్వాలని ఆర్‌‌‌‌‌‌‌‌ఐ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో సదరు రైతు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు.

వారి సూచనతో వెంకటస్వామి గురువారం అంతర్గాం తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి ఆర్‌‌‌‌‌‌‌‌ఐ శ్రీమాన్‌‌‌‌‌‌‌‌కు డబ్బులు ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఆర్‌‌‌‌‌‌‌‌ఐని రెడ్‌‌‌‌‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. శ్రీమాన్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. దాడుల్లో సీఐలు తిరుపతి, పున్నం చందర్, ప్రేమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.