
మనం అందరికీ తెలియాలి. మనకు అందరూ తెలియాలి… ఈ కాన్సెప్టునే ఫాలో అవుతున్నారు ధనుష్. ఉత్తరాదికి పూర్తిగా షిఫ్ట్ కాకుండా, అలాగని అక్కడి వాళ్లకు దూరంగా ఉండకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా మరో బాలీవుడ్ సినిమాకు సైన్ చేశారనే టాక్ వైరల్ అవుతోంది. బాలీవుడ్‌లో ఫస్ట్ మూవీ నుంచే తనకంటూ ఓ స్పెషల్ ప్లేస్‌ని క్రియేట్ చేసుకున్నారు ధనుష్. సౌత్ హీరో అనే ఫీలింగ్ రానివ్వకుండా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సౌత్ సినిమా కరతో బిజీగా ఉన్నారు ధనుష్. ఈ సమ్మర్‌లో కర రిలీజ్ అయ్యాక బాలీవుడ్‌లో మరో సినిమా చేయాలన్నది ధనుష్ ప్లాన్. తేరే ఇష్క్ మే సెట్స్ మీదున్నప్పుడే ఆనంద్ ఎల్ రాయ్ ఓ కాన్సెప్ట్ చెప్పారట ధనుష్‌కి. ఆ ఐడియాను ఇప్పుడు కంప్లీట్‌గా డెవలప్ చేశారట. ధనుష్ అండ్ కృతి.. ఇద్దరూ ఆనంద్‌కి ఓకే చెప్పేశారన్నది న్యూస్. పక్కా లవ్ సబ్జెక్టుతో ప్యాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారట ప్రాజెక్టుని. ఈ ఏడాది డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Raaka: క్రూరుడు.. కత్తిలాంటి కుర్రాడు.. బన్నీ డ్యుయల్ రోల్
‘అటు మామ.. ఇటు బావ..’ అబ్బో.. ఖుషీగా బన్నీ
TOP 5 ET: ఆయనే ముందు ప్రపోజ్ చేశారు.. – అన్నా
Virat Kohli: ధురంధర్‌కి విరాట్ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్ ట్వీట్