
బంధువుల ఆరోపణ
వరంగల్ జిల్లా ఎకె తండాలో దారుణం
జాతీయ రహదారిపై ధర్నా
మన తెలంగాణ/వర్ధన్నపేట/రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మం డల పరిధిలోని ఏకే తండాలో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. బుధవారం రాత్రి ఏకే తండాకు చెందిన చిట్టి అనే యువతి(21) నలుగురు యువకులు అత్యాచారం చేసి ఉరి వేసి చంపారని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో యువతి మృతిచెందగా వర్ధన్నపేట మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ యువతి కుటుంబ సభ్యులు మార్చురీ ఎదుట జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. నలుగురు యువకులు ఎల్లప్పుడు గంజాయి మత్తులో ఉండేవారని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు.
గంజాయి మత్తులో నలుగురు యువకులు ఆ యువతి పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి చంపేశారని ఆరోపిస్తూ మృతురాలు కుటుంబ సభ్యులు వర్ధన్నపేట సెంటర్ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అమాయకురాలైన యువతిని కిడ్నాప్ చేసి ఆపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి హతమార్చారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.నిందితులను శిక్షించే దాకా మృతదేహానికి పోస్టుమార్టం చేసేది లేదంటూ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పడంతో వర్ధన్నపేట మార్చురీ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.