Reading Time: 2 minutes

అక్కినేని నాగార్జున మేనకోడలుకి సమంత సపోర్ట్.. ‘డెకాయిట్’ టీమ్‌పై ప్రశంసలు!

Caption of Image.

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ చిత్రం  ‘డెకాయిట్’ (Dacoit). భారీ అంచనాలతో ఈరోజు ( ఏప్రిల్ 10న ) ఈమూవీ థియేటర్లలోకి వచ్చింది.  తొలి రోజు ఫుల్ ఓపెనింగ్ తో అభిమానులను మెప్పించింది. ఈ సందర్భంగా  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఈ చిత్ర బృందానికి తన హృదయపూర్వక మద్దతును తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ, చిత్ర యూనిట్ పడిన కష్టాన్ని ఆమె ఎంతగానో మెచ్చుకున్నారు.

సమంత ప్రశంసల జల్లు

ఈ చిత్రం వెనుక ఉన్న కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించిన సమంత, అక్కినేని నాగార్జున మేనకోడలు  నిర్మాత సుప్రియ యార్లగడ్డ డెడికేషన్‌ను ప్రశంసించారు. ఈ టీమ్ కచ్చితంగా విజయం సాధిస్తుంది.  మీ హార్డ్ వర్క్ ఎప్పుడూ వృధా పోదు అంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రధాన నటీనటులు అడివి శేష్, మృణాల్ ఠాకూర్లను అభినందించడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి.

రివెంజ్ డ్రామాగా ‘డెకాయిట్’

షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. అన్యాయంగా జైలుకు వెళ్లిన ‘హరి’ (అడివి శేష్) అనే యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. జైలు నుండి తప్పించుకున్న హరి, తన జీవితాన్ని తలకిందులు చేసిన తన మాజీ ప్రియురాలు ‘జూలియట్’ (మృణాల్ ఠాకూర్)పై పగ తీర్చుకోవడమే ఈ చిత్ర ఇతివృత్తం.  ప్రధానంగా ఈ మూవీ కథ  ప్రేమ, నమ్మకద్రోహం, ప్రతీకారం చుట్టూ తిరుగుతుంది.

ఈ మూవీలో అనురాగ్ కశ్యప్ పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించారు. ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందింది. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలతో ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద హిట్ పక్కా అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : ప్రముఖ నటుడు కన్నుమూత..

ఫుల్ బిజీగా సమంత..

మరోవైపు, సమంత తన తదుపరి చిత్రం ‘మా ఇన్ని బంగారం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘ఓ బేబీ’ వంటి హిట్ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో సమంత చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. ఇందులో సమంత ఒక పవర్‌ఫుల్, ఎమోషనల్ యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. దీంట్లో  గుల్షన్ దేవయ్య, దిగంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మే 15, 2026న విడుదల కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో  ‘డెకాయిట్’ చిత్రానికి సమంత అందించిన సపోర్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అడివి శేష్ వైవిధ్యమైన కథాంశాలు, మృణాల్ ఠాకూర్ నటన ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలబెడతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

 

©️ VIL Media Pvt Ltd.