
హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుంట్లూరులో హైడ్రా అధికారులు కూలివేతలు చేపట్టారు. 204 సర్వే నంబర్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. 1991 లో ప్లాట్ లు అయిన 5 ఎకరాల భూమిని రోడ్లను కబ్జా చేసి ఏర్పాటు చేసిన భారీ ఐరన్ షీట్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో ప్లాట్ల యజమానులకు – వెంచర్ యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ ల్యాండ్ లో ఉన్న షెడ్ లను కూల్చారని హైడ్రాపై హైకోర్టుకు వెళ్లి పిర్యాదు చేస్తామని వెంచర్ యజమానులు హెచ్చరించారు.