
మేడ్చల్ మల్కాజ్ గిరి: పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన ఘటనలో యువతి ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో నెల రోజుల క్రితం పెళ్లికి నిరాకరించిన యువతికి మనోహర్ అనే యువకుడు ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. ఇవాళ మనోవేదనతో ఇంట్లో ఉరి వేసుకుని సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు మనోహర్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. గతంలో యువతికి యువకుడు మనోహర్‌తో వివాహం నిశ్చయమైంది. మనోహర్‌కు ఎయిడ్స్ ఉందని తేలడంతో అతడితో పెళ్లికి యువతి నిరాకరించింది. యువతిపై పగ పెంచుకొని ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఆమెకు అతడు ఇంజక్షన్ చేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.