
అధిక రక్తపోటును నియంత్రించడంలో మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా అంతే ముఖ్యం. మీరు కూడా అధిక రక్తపోటుతో బాధపడుతుంటే, ఈ వార్త ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తపోటును సహజంగా నియంత్రించడంలో సహాయపడే కొన్ని కూరగాయల నుండి పండ్లు, నట్స్ వరకు ప్రత్యేక ఆహార పదార్థాల ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తప్పనిసరిగా డైట్ లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కాకరకాయ
కాకరకాయ చేదు రుచి కారణంగా చాలామంది ఈ కూరగాయను తినడానికి వెనుకాడతారు. అయితే, ఇది అధిక రక్తపోటు రోగులకు ఒక వరమని తెలియదు. కాకరకాయలోని ప్రత్యేక పోషకాలు రక్తపోటును నియంత్రించడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి.
జామకాయ
అధిక రక్తపోటు ఉన్నవారికి జామకాయ ఒక అద్భుతమైన పండు. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పొటాషియం శరీరంలో సోడియం హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది సాధారణ రక్తపోటును నిర్వహించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
బార్లీ పిండి
అధిక రక్తపోటు ఉంటే, గోధుమ పిండి రొట్టెలు బదులుగా ఆహారంలో బార్లీ పిండి రొట్టెలు చేర్చుకోవడం చాలా మంచిది, ఆరోగ్యం కూడా ఎందుకంటే ఇందులో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అవిసె గింజలు
అవిసె గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. రోజూ ఒక టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలను తినడం వల్ల సిరలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.
బాదం పప్పులు
బాదం పప్పులు మెదడును చురుగ్గా చేయడమే కాకుండా గుండెను కూడా కాపాడతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. రాత్రంతా నానబెట్టి 4-5 బాదాం పప్పులను ఒలిచి తీసుకోవడం తినడం ఉత్తమ మార్గం.
మెంతుల నీరు
అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే ఆహార పదార్థాలలో మెంతుల నీరు కూడా ఒకటి. ఇందుకోసం అర టీస్పూన్ మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఈ చిన్న అలవాటు శరీరంలో రక్తపోటు, చక్కెర స్థాయిలను రెండింటినీ మెరుగ్గా నియంత్రిస్తుంది.