Reading Time: < 1 minute

ఫుల్ గా తాగి ఆర్టీసీ బస్సు, డ్రైవర్ పై దాడి..

Caption of Image.

మహబూబాబాద్ జిల్లాలో మద్యం మత్తులో ఒక వ్యక్తి చేసిన వీరంగం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సును అడ్డుకోవడమే కాకుండా.. సిబ్బందిపై దాడికి తెగబడటం స్థానికంగా  ఏప్రిల్ 9న కొత్తగూడ మండలం నుంచి వరంగల్ జిల్లా నర్సంపేటకు టీజీఎస్‌ఆర్టీసీ బస్సు బయలుదేరింది. బస్సు చిలకమ్మా నగర్ – పాఖాల అటవీ మార్గం మధ్యలోకి చేరుకోగానే.. అకస్మాత్తుగా మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి బస్సును అడ్డుకున్నాడు.

డ్రైవర్‌తో అనవసర వాగ్వాదానికి దిగిన ఆ వ్యక్తి ఆవేశంతో ఊగిపోతూ రాయి తీసుకుని బస్సు అద్దాలను పగలగొట్టాడు. అంతటితో ఆగకుండా విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్ , కండక్టర్‌పై భౌతిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు మద్యం మత్తులో తూలుతూ అసభ్య పదజాలంతో దూషిస్తుండటంతో.. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో బస్సులోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు.

ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడమే కాకుండా, బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.