
అమరావతి: అప్పులు ఇచ్చిన వారు మోసం చేయడంతో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పోలవరం జిల్లా అడ్డుతీగల ప్రాంతంలో గోగిన జయకిషన్(55) నివసిస్తున్నాడు. చిట్టీలు పాడి, తెలిసిన వారి దగ్గర అప్పులు తీసుకొచ్చి వేణి, ఈశ్వర్ రావు, వై లక్ష్మీభవాని, రమ్య, కె రామకృష్ణ, తదితరలకు రూ.35 లక్షల వరకు అప్పులు ఇచ్చాడు. కొందరు ఏడు లక్షల వరకు అప్పులు చెల్లించారు. మిగిలిన డబ్బులు ఇవ్వమంటే అతడితో వారు గొడవకు దిగారు. స్థానికు ఎంఎల్‌ఎ అనుచరుడు అండ చూసుకొని అప్పులు వాళ్లు డబ్బులు ఇవ్వడంలేదని జయకిషన్ ఆరోపణలు చేశాడు. కేసు పెట్టుకోవాలంటూ వారంతా తనపై తిరగబడ్డారని తెలిపాడు. దీంతో తనకు అప్పులు ఇచ్చిన వాళ్లు అడగడంతో ఏం చేయాలో అతడికి తోచలేదు. రెండు కవర్లలో మూడు లీటర్ల పెట్రోలు తీసుకొని రాజమహేంద్రవరంలోని రాజోల్ లో చేరుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. మంత్రి నారా లోకేశ్‌కు వీడియోను షేర్ చేశాడు. తనను మోసగించిన వారి నుంచి మొత్తం రికవరీ చేసి తాను తీర్చాల్సిన అప్పులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.