Reading Time: < 1 minute

కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్ మూడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన లక్నో ఇన్నింగ్స్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు మిఛెల్ మార్ష్ (15), ఐడెన్ మార్‌క్రమ్ (22) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బడోని 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54 పరుగులు చేశాడు. చివర్లో ముకుల్ చౌదరి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌కు అద్భుత గెలుపును అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ముకుల్ 27 బంతుల్లోనే ఏడు సిక్స్‌లు, 2 ఫోర్లతో అజేయంగా 54 పరుగులు చేశాడు. అంతకుముందు కోల్‌కతా టీమ్‌లో రహానె (41), రఘువంశీ (45), పొవెల్ (39), గ్రీన్ (32) పరుగులు చేశారు.