
‘ధురందర్’ , ‘ధురందర్: ది రివెంజ్’ చిత్రాల విజయంతో సారా అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడీ అమ్మడికి వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే యుఫోరియా సినిమాలతో తన నటనతో ఆక్టటుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడిన పాత్రకు సిద్ధమవుతోంది. భారతీయ సినిమా దిగ్గజం, ఎవర్ గ్రీన్ బ్యూటీ మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్ ఆమె పాత్రను పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి . ఈ చిత్రానికి ‘డార్లింగ్స్’ ఫేమ్ దర్శకుడు జస్మీత్ కె. రెయిన్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మధుబాల స్వర్ణయుగాన్ని పునఃసృష్టించేందుకు చిత్ర బృందం భారీ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు అనుగుణంగా చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కాగా మధుబాల ఆకర్షణ, అందాన్ని తెరపైకి తీసుకురావడానికి సారా అర్జున్ చాలా కష్టపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ కాలం నాటి భాషా శైలిలో ప్రావీణ్యం సంపాదించడానికి సారాకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని తెలుస్తోంది. మధుబాల ఐకానిక్ లుక్స్‌ను రీక్రియేట్ చేసేందుకు ఇప్పటికే అనేక లుక్ టెస్ట్‌లు జరుగుతున్నాయని సమాచారం. దర్శకుడు జస్మీత్ కె. రీన్ ఈ చిత్రాన్ని కేవలం ఒక విజయగాథగా కాకుండా, మధుబాల జీవితంలోని ఒడిదుడుకులను, భావోద్వేగ సంఘర్షణలను చిత్రీకరించే ఒక ఇంటెన్స్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రం మధుబాల వ్యక్తిగత జీవితంలోని రహస్యాలతో పాటు ఆమె కెరీర్‌లోని మైలురాళ్లను ఆవిష్కరిస్తుందని సమాచారం. “భారతీయ సినిమా రంగంలో అత్యంత అభిమానించే నటీమణులలో ఒకరి జీవిత కథ ఆధారంగా సినిమా తీయడం ఒక బాధ్యతాయుతమైన పని. సారా అర్జున్ ఆ పాత్రకు న్యాయం చేస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది,” అని చిత్ర బృందంలోని ఒక వ్యక్తి చెప్పినట్లు సమాచారం.
మధుబాల బయోపిక్ లో ధురంధర్ హీరోయిన్..
1950వ దశకంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటి మధుబాల. తన రెండు దశాబ్దాల కెరీర్‌లో 70కి పైగా చిత్రాలలో నటించారు. చిన్న వయసులో కన్నుమూసినా ఆమె అందం, నటన సినీ ప్రేమికుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.