Reading Time: < 1 minute
Gujarat Titanss Closest Wins In Ipl History 1 Run Thriller Vs Dc Tops The List In 2026

ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ (జీటీ) తమ అద్భుత ఆటతో ఎన్నో సంచలన విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా అతి తక్కువ తేడాతో గెలిచిన మ్యాచ్‌లలో జీటీ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై నమోదైన విజయం ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో బుధవారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో జీటీ కేవలం ఒక పరుగుతో ఢిల్లీని ఓడించింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ విజయం జీటీ చరిత్రలోనే అత్యంత క్లోజ్ విక్టరీగా నిలిచింది.

2024 సీజన్‌లో అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్‌పై 6 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఇది జీటీకి రెండో క్లోజ్ విక్టరీగా నిలిచింది. 2023లో లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై 7 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. 2022లో ముంబై డీవైపీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీంపై 8 పరుగుల తేడాతో గెలిచింది. అదే సంవత్సరంలో పుణెలో మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఇలా వరుసగా క్లోజ్ మ్యాచ్‌లలో గెలుస్తూ.. జీటీ తన సత్తాచాటింది. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా కూల్ గేమ్ ఆడడం జీటీ విజయ రహస్యం అని చెప్పాలి.

Also Read: DC 1 Run Defeats: ఢిల్లీ క్యాపిటల్స్‌కి శాపంగా మారిన ఒక్క పరుగు.. ఐపీఎల్‌లో చెత్త రికార్డ్!

గుజరాత్ టైటాన్స్ అతి తక్కువ పరుగులతో గెలిచిన మ్యాచ్‌లు:
# 1 రన్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌, ఢిల్లీ, 2026
# 6 పరుగులు vs ముంబై ఇండియన్స్‌, అహ్మదాబాద్, 2024
# 7 పరుగులు vs లక్నో సూపర్ జెయింట్స్, లక్నో, 2023
# 8 పరుగులు vs కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై, 2022
# 14 పరుగులు vs ఢిల్లీ క్యాపిటల్స్‌, పూణే, 2022