Reading Time: < 1 minute
Beans: అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా 5 నిమిషాల్లో వలిచేయండి..

చిక్కుడుకాయలను వండటం ఎంత ఆరోగ్యకరమో, వాటిని వలవడం, కట్ చేయడం అంత ఓపికతో కూడుకున్న పని. సాధారణంగా చాలామంది చిక్కుడుకాయలను చేత్తో తుంచుతుంటారు, కానీ దీనివల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా ముక్కలు కూడా సమానంగా రావు. ఈ సమస్యను అధిగమించి, చిక్కుడుకాయలను సులభంగా, ఫాస్ట్‌గా ఎలా సిద్ధం చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. ముందుగా చిక్కుడుకాయలను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. వీటిని ఉప్పు నీటిలో ఐదు నిమిషాల పాటు నానబెట్టి, ఆ తర్వాత మంచి నీటితో కడిగి ఆరనివ్వాలి. దీనివల్ల వాటిపై ఉండే మలినాలు పూర్తిగా తొలగిపోతాయి. చాలామంది చిక్కుడుకాయలను తుంచేటప్పుడు వేళ్లు నొప్పి పుడుతుంటాయి. పైగా వాడిపోయిన కాయలు అయితే అస్సలు తెగవు.

ఇది చదవండి: ఒక్క టూత్‌పిక్ చాలు.. వేళ్లకు నొప్పి లేకుండా వెల్లుల్లి పొట్టును ఈజీగా వలవొచ్చు..

దీనికి పరిష్కారంగా, మొదట చిక్కుడుకాయలకు అటు ఇటు ఉండే పీచును తీసివేసి, లోపల పుచ్చు ఉందో లేదో ఒకసారి విడదీసి చూసుకోవాలి. ఇలా పీచు తీసి విడదీసిన కాయలన్నింటినీ ఒకదానిపై ఒకటి పెట్టి, కత్తితో మీకు కావలసిన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పద్ధతి పాటించడం వల్ల ముక్కలన్నీ ఒకే సైజులో ఉంటాయి, దీనివల్ల కూర వండినప్పుడు అన్ని ముక్కలు సమానంగా ఉడుకుతాయి. కేవలం కూరలకే కాకుండా ఫ్రైడ్ రైస్ లేదా వెజిటబుల్ బిర్యానీ వంటి వంటకాల కోసం కూడా ఈ పద్ధతిలో చిక్కుడుకాయలను చాలా త్వరగా, నీట్‌గా కట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పని సులువు అవ్వడమే కాకుండా వంట కూడా చూడటానికి మంచిగా కనిపిస్తాయి.

ఇది చదవండి: పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..