Reading Time: 2 minutes
Jeevan Reddy Emotional Meeting Kcr Joins Brs Telangana Politics

తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ఇద్దరు దిగ్గజ నేతలు.. ఒకరు ఉద్యమ నాయకుడు కేసీఆర్, మరొకరు రైతు పక్షపాతి జీవన్ రెడ్డి. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు ఒక్కటవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శుక్రవారం నాడు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు , పార్టీ ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ నివాసంలోకి అడుగుపెట్టిన జీవన్ రెడ్డిని చూడగానే గులాబీ అధినేత సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.

“అన్నా.. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీతో కలిసి పని చేయమని ఆ దేవుడే నన్ను మీ దగ్గరికి పంపిండు. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అన్నా..” అంటూ మనసులోని మాటను వ్యక్తం చేస్తూ కళ్లవెంట నీళ్లు పెట్టుకున్నారు. దీంతో కేసీఆర్ గారు వెంటనే ఆయనను అనునయిస్తూ, అప్యాయంగా దగ్గరకు తీసుకుని హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. అనంతరం జీవన్ రెడ్డిని దుశ్శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Jananayagan Leaks: ‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ ఆగ్రహం: “అది ఒకరి కల.. దాన్ని నీరుగార్చకండి!”

ఈ భేటీలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి వెంట ఆయన కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు కూడా ఉన్నారు. కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్న అనంతరం, కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి బృందానికి మధ్యాహ్న భోజన ఆతిథ్యం ఇచ్చారు.

Jananayagan : ‘జననాయగన్’ సినిమాను సోషల్ మీడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు..

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉండి, తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం, కేసీఆర్‌ను “అన్నా” అని సంబోధిస్తూ భావోద్వేగానికి లోనవ్వడం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఈ చేరిక ఒక పెద్ద ఊతమివ్వనుంది.