
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ పరిరక్షణకు ఐక్య పోరాటాలు చేయడానికి కార్మిక సంఘాలు సిద్ధంగా ఉండాలని సీఐటీయూ స్టేట్ప్రెసిడెంట్ తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట1 బొగ్గు గనిపై నిర్వహించిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. మెడికల్ బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వైఖరి సరిగాలేదన్నారు. కార్మిక సంఘాలను బద్నానం చేస్తున్న సర్కార్..సంస్థకు ఇవ్వాల్సిన రూ.వేల కోట్ల బకాయిలపై నోరు మోదపడంలేదని విమర్శించారు.
మెడికల్బోర్డును వెంటనే నిర్వహించాలని డిమాండ్చేశారు. గెలిచిన సంఘాల లీడర్ల అలసత్వంతో సింగరేణి యాజమాన్యం రెండేళ్లుగా కార్మికులకు నాణ్యమైన రక్షణ పనిముట్లు ఇవ్వడంలేదన్నారు. గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గని మేనుజర్సతీశ్కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ డిప్యూటీ జనరల్సెక్రటరీ అల్లి రాజేందర్, మందమర్రి బ్రాంచి ప్రెసిడెంట్ఎస్.వెంకటస్వామి, పిట్సెక్రటరీ శ్రీధర్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.