
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026 సంవత్సరం నుంచి 2.1 శాతం డిఎ పెంచుతామని ప్రకటించింది. ఇంతకు ముందు 50.7 శాతం డిఎ ఉండగా ఇపుడు దాన్ని 52.8 శాతానికి పెంచినట్టు ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన డిఎ జనవరి 1, 2026 నుండి అమలు చేస్తామని, గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. పెరిగిన డిఎ ద్వారా ఆర్టీసీ పై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
చివరగా జూలై 2025 లో కూడా 2.1 శాతం డిఎం పెంచిన విషయం తెలిసిందే. జూలై 2025 లో 48.6% నుండి 50.7% నికి పెంచింది. ప్రస్తుతం పెరిగిన 2.1 శాతం డిఎతో 52.8 % కి చేరింది. మే 2024 లో ఆర్ పిఎస్ , 2017 అమలు తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఎ బకాయిలు లేవని ప్రభుత్వం వివరించింది
డిఎ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ లో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్ లో ఆర్ ఎం లతో సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డిఎను ప్రభుత్వం విడుదల చేసిందని తెలియజేశారు. జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వస్తుందని, దీంతో సవరించిన డిఎ 52.8 శాతానికి చేరిందని వివరించారు. జనవరి నుండి ఇవ్వాల్సిన పెండింగ్ డిఎలు భవిష్యత్ లో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో మొదటి నుండి ఆర్టిసి సంస్థ పరిరక్షణ ,ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పని చేస్తుందని తెలిపారు. సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమం పై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణ కు ఆసుపత్రి అప్గ్రెడేషన్ చేశామని, కారుణ్య నియామకాలు, దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం ,కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తుందని విరించారు. తెలంగాణ లో ఉన్న ప్రతి ఆర్టీసీ ఉద్యోగులందరికీ పెంచిన డిఎ ఉపయోగపడుతుందని, తెలంగాణలో లైఫ్ లైన్ గా ఉన్న ఆర్టీసిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లలా కృషి చేయాలని పొన్నం సూచించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.