Reading Time: < 1 minute

లెబనాన్‌‌‌‌తో త్వరలోనే చర్చలు: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

Caption of Image.

జెరూసలెం:  కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌‌‌‌ను తప్పనిసరిగా చేర్చాలని ఇరాన్ పట్టుబడుతుండగా, ప్రారంభ ఒప్పందంలో లెబనాన్ ఎప్పుడూ భాగం కాదని అమెరికా, ఇజ్రాయెల్ రెండూ స్పష్టం చేస్తున్నాయి. లెబనాన్‌‌‌‌తో సాధ్యమైనంత త్వరగా నేరుగా చర్చలు జరపడానికి తాను అనుమతించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం తెలిపారు.

“ఇజ్రాయెల్‌‌‌‌తో నేరుగా చర్చలు జరపాలని లెబనాన్ పదేపదే చేసిన విన్నపాలను దృష్టిలో ఉంచుకుని, లెబనాన్‌‌‌‌తో సాధ్యమైనంత త్వరగా చర్చలు ప్రారంభించాలని నేను నిన్న క్యాబినెట్‌‌‌‌ను ఆదేశించాను” అని నెతన్యాహు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. “ఈ చర్చలు హిజ్బుల్లాను నిరాయుధులను చేయడం, ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శాంతి సంబంధాలను నెలకొల్పడంపై దృష్టి సారిస్తాయి. బీరుట్‌‌‌‌ను సైన్యం లేని ప్రాంతంగా మార్చాలని లెబనాన్ ప్రధాని ఈరోజు ఇచ్చిన పిలుపును ఇజ్రాయెల్ అభినందిస్తోంది” అని ఆయన తెలిపారు.  

©️ VIL Media Pvt Ltd.