Reading Time: 2 minutes

ఇలాంటి దాదాగిరి ఈ మధ్య కాలంలో చూసి ఉండరు.. ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందని మహిళ రచ్చో రచ్చ

Caption of Image.

కొందరు చిన్నదానికి అందుబాటులో ఏది ఉంటే అది తీసి నేలకు కొట్టడం చూస్తుంటాం.. ముఖ్యంగా ఇంట్లో భర్తపైన భార్య, భార్యపైన భర్త కోపాన్ని ప్రదర్శించేందుకు అసహనంతో చేసే అలవాటు.. కొన్ని సార్లు మనల్ని ఇరకాటంలో పడేస్తుంటుంది. ఇక్కడ ఒక మహిళ కూడా ఇంట్లో చూపించే అసహనం బయట చూపించడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో ఒక మహిళ చేసిన రచ్చ.. వైరల్ గా మారింది. 

బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఒక మహిళ చేసిన ఓవర్ యాక్షన్ పై 2026 ఆగస్టు 14న పోలీసు కంప్లైంట్ నమోదైంది. ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందని ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ.. ఎయిర్ పోర్టు లాంజ్ లో ఉన్న ఉద్యోగులపై తన ప్రతాపం చూపింది. అక్కడున్న వస్తువులు తీసి టేబుల్ కేసి కొట్టడంతో.. సీట్ లో ఉన్నవాళ్లంతా భయంతో లేచి నిలబడాల్సి వచ్చింది. 

ఎయార్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. మమోనీ ఖారత్ అనే మహిళ.. 6E 7352 ఇండిగో ఫ్లైట్ లో కోల్ కతా వెళ్లాల్సి ఉంది. టెక్నికల్ సమస్య కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో అసహనం కోల్పోయిన మహిళ ఆగ్రహావేశాలతో అరుస్తూ.. వస్తువులను ధ్వంసం చేసింది. సాటి ప్యాసెంజర్లు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా శాంతించలేదు. 

ఒక మానిటర్, కీబోర్డు తో పాటు.. పాస్ పోర్టు స్వైపింగ్ మెషీన్ ను డ్యామేజ్ చేసింది. జరిగిన డ్యామేజ్ విలువ 49 వేల రూపాయలకు లెక్కగట్టారు. 

దురుసుగా ప్రవర్తించి ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసిన మహిళపై యాక్షన్ తీసుకోవాలని.. డ్యామేజ్ అయిన వస్తువులకు సదరు ప్యాసెంజర్ నుంచి రికవరీ చేసి ఇప్పించాల్సిందిగా కంప్లైంట్ రైజ్ చేశారు. తగిన చర్యలు తీసుకుని రికవరీ చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. 

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు:

అయితే సోషల్ మీడియాలో ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఎంత అర్జెంట్ పనిలో ఉందో.. ఏం అవసరం ఉందో.. సడెన్ గా క్యాన్సిల్ అంటే పరిస్థితిని బట్టి రియాక్ట్ కావాల్సి వస్తుందని కొందరు అంటున్నారు. వస్తువులు డ్యామేజ్ అయ్యాయని రికవరీ చేస్తామంటున్నారు.. మరి ఆమె టైమ్ రికవరీ చేసి ఇవ్వగలరా అని కొందరు కామెట్ చేశారు. 

మరి కొందరు.. అంత అసహనం పనికిరాదు.. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఆమె ఒక్కరికే కాదు కదా.. అందరికీ క్యాన్సిల్ అవుతుంది కదా.. అంత ఓవర్ గా రియాక్ట్ అయినందుకు 49 వేల రూపాయల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అసహనం అన్ని చోట్ల మంచిదికాదని కాదని కామెంట్స్ చేస్తున్నారు. 

ఆమె కోపానికి కారణం :

ఆమె కోపానికి కారణం లేకపోలేదని కొందరు అంటున్నారు. ఆమె కొడుకు ఆరోగ్యం బాలేదట. వీలైనంత తొందర ఆమె కొడుకుని చూడాలని ఆరాటంలో ఉంది. ముందే చెబితే ఆల్టర్నేట్ చూసుకునేదాన్ని.. 3 గంటలు వెయిట్ చేసి క్యా్న్సిల్ అని చెబితే ఏంటిపరిస్థితి అని ఆమె చెప్పింది. అక్కడ ఉన్న ప్యాసెంజర్లు కూడా కొందరు ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. అంతసేపు వెయిట్ చేయించి ఫ్లైట్ క్యాన్సిల్ అంటే ఎటు పోవాలి..? కనీసం ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేయకుండా.. ఫ్లై ట్ రద్దయిందని చెబితే ఎంత కష్టం అని అంటున్నారు. 

©️ VIL Media Pvt Ltd.