Reading Time: < 1 minute

స్పిల్‌ అలారం.. ఇది పాలు పొంగు వచ్చే టైంకు మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది !

Caption of Image.

అప్పుడప్పుడు పాలను స్టవ్‌‌ మీద పెట్టి వేరే పనుల్లో మునిగిపోతుంటాం. కాసేపయ్యాక చూస్తే అవి పొంగి నేల పాలవుతాయి. అందుకే పాలు, టీ, కాఫీ లాంటివాటిని కాచేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఇలాంటి ప్రొటెక్టర్ గ్లాస్‌‌ డిస్క్‌‌ వాడాలి. దీన్ని దర్మో అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. ఈ గ్లాస్‌‌ని స్టవ్‌‌ వెలిగించకముందే పాల గిన్నె అడుగు భాగంలో పెట్టాలి. పాలు మరిగే స్థాయికి చేరుకోగానే, ఈ డిస్క్ గిన్నెకు తగులుతూ ఒక రకమైన శబ్దం చేస్తుంది. దాంతో అప్రమత్తం అవుతాం.

ఇది ఫిజిక్స్‌‌ సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. అన్ని రకాల వంట పాత్రలు, స్టవ్‌‌టాప్‌‌ల్లో వాడుకోవచ్చు. దీన్ని 1.25 సెంటీమీటర్ల మందంతో హైక్వాలిటీ గాజు పదార్థంతో తయారుచేశారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. మన్నికగా ఉంటుంది. దీన్ని మరుగుతున్న పాల గిన్నెలో నుంచి తీసిన తర్వాత 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత డిటర్జెంట్‌‌తో శుభ్రం చేసి, ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. 

ధర 295 రూపాయలు

©️ VIL Media Pvt Ltd.