
సెన్సేషన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ హవా కొనసాగిస్తున్నాడు. తమిళంతో పాటుగా తెలుగు, హిందీ భాషల సినిమాలతో రయ్యుమంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్ లో స్పెషల్ షో చేసి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే అనిరుధ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న పెళ్లి రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యంగా సన్ టీవీ వారసురాలు, కళానిధి మారన్ ఏకైక డాటర్ కావ్య మారన్తో డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తన ఎక్స్‌ప్రెషన్స్‌తో బాగా పాపులర్ అయినా కావ్యతో అనిరుధ్ పెళ్లి వార్తలు వస్తుండటంతో సినీ, క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
అయితే, ఈ రూమర్స్ గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా మ్యారేజ్ అనౌన్స్ మెంట్ వరకు వెళ్లడం విశేషం. అంతేకాకుండా అనిరుధ్‌తో కావ్య మ్యారేజ్ డిసైడ్ అయిందని.. అతి త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగనుందని తమిళ సినీ వర్గాల్లో టాక్ ఊపందుకుంది.
అయితే, ఇటీవల జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో అనిరుధ్‌ను పెళ్లి గురించి ప్రశ్నించగా, ఆయన సరదాగా “This again” అని మాత్రమే స్పందించారు. దీంతో ఆయన ఈ విషయంపై స్పందించకుండా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
🗣️: Sir, Sikiram marriage ku invite pannunga #Anirudh: Idhu Vera😂 pic.twitter.com/25je7w4wor
— Movie Buff (@moviesbuff_) March 7, 2026
రూమర్స్కి బలం:
2025 జూన్ సమయంలో సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి కనిపించారనే పోస్టులు వైరల్ అయ్యాయి. లాస్ వేగాస్‌లో వాక్ చేయడం, డిన్నర్ అవుటింగ్స్ వంటి ఫొటోస్ బయటకొచ్చాయి.
►ALSO READ Asaduddin Owaisi: అదో చెత్త సినిమా.. కేవలం బూతులు, హింసే.. ధూరంధర్ 2పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్!
2025 నవంబర్ లో కూడా అమెరికా న్యూయార్క్ వీధుల్లో కలిసి తిరుగుతూ కనిపించారు. ఓ UK వ్లాగర్ తీసిన వీడియోలో అనుకోకుండా ఈ జంట చిక్కింది. అయితే వాళ్లు వెళ్లింది అమెరికాలోని న్యూయార్క్ కాదని, UK అని కూడా టాక్ వినిపించింది. అయితే, ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అయితే ఇవి అధికారికంగా ఎక్కడా నిర్ధారించబడలేదు
Bro Caught On 4K Got Real 🤯 #AnirudhRavichander #KavyaMaran pic.twitter.com/opPWkLcpV9
— Sadiq Basha (@SadiqBasha_) November 13, 2025
అయితే, ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కోసం అనిరుధ్ ప్రత్యేకంగా థీమ్ సాంగ్ కంపోజ్ చేయడంతో మరింత క్లారిటీ వచ్చింది. దీంతో సీక్రెట్ లవర్స్ భలే దొరికేశారంటూ నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తూ వచ్చారు.
ప్రొఫెషనల్ కనెక్షన్
కావ్య మారన్ IPLలో హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్‌కు యజమానురాలిగా, ఛైర్మన్‌గా వ్యవహరిస్తోంది. అలాగే, Sun TV, Sun Pictures నెట్‌వర్క్‌తో సంబంధం ఉంది. అనిరుధ్ కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ లో అనేక ప్రాజెక్ట్‌లు చేశారు. ఈ ఇండైరెక్ట్ కనెక్షన్ కూడా ఈ రూమర్స్‌కు మరింత కారణమవుతోంది. ఏది ఏమైనా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తన ఎక్స్‌ప్రెషన్స్‌తో బాగా పాపులర్ అయినా కావ్య.. మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ తో ఏడడుగులు వేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అనిరుధ్ సినిమాల విషయానికి వస్తే..
ప్రస్తుతం అనిరుధ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీకి ఇతను బాగా కావాల్సిన వాడిగా మారాడు. రీసెంట్ టైమ్స్లో దేవర, వెట్టయన్, కూలీ, కింగ్డమ్ వంటి సినిమాలతో టాలీ, కోలీవుడ్ ఆడియన్స్కి బూస్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం నాని ది ప్యారడైస్ మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. అయితే, అనిరుధ్ తన ఎక్కువ సినిమాలు సన్ టీవీ ఓనర్, కావ్య మారన్ ఫాదర్ కళానిధి మారన్ బ్యానర్లో పనిచేయడం విశేషం.
#AayaSher 🦁 https://t.co/yRGjiX1s1s
Madness of @NameisNani and @odela_srikanth 🔥#Paradise #TheParadise
Thank you and love you all 🙂
Vocals – Addula Jangireddy, Arjun Chandu, Akkunoori Devaihah 💥
Lyrics – @LyricsShyam 💪🏻 pic.twitter.com/i8fJCKh3eG
— Anirudh Ravichander (@anirudhofficial) February 24, 2026