Reading Time: 2 minutes

విడాకులు రాకముందే ‘అన్‌మ్యారీడ్’గా జయం రవి.. కెనీషా ఫ్రాన్సిస్‌తో కలిసి కొత్త డీల్!

Caption of Image.

కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ పేరు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతోంది. తన భార్య ఆర్తి రవితో విడాకుల ప్రకటన తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన  ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో కలిసి గోవాలో ఆస్తి కొనుగోలు చేశారన్న వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. కేవలం ఆస్తి కొనడమే కాదు, అందులో ఆయన పేర్కొన్న ఒక వివరమే ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. 

రూ. 40 లక్షల డీల్.. కానీ 

రవి మోహన్ , కెనీషా కలిసి గోవాలో సుమారు రూ. 40 లక్షల విలువైన ప్రాపర్టీని కొనుగోలు చేశారని సమాచారం. అయితే, ఈ ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల్లో రవి మోహన్ తన వైవాహిక స్థితిని (Marital Status) ‘అన్‌మ్యారీడ్’ అని పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆర్తి రవితో విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్న తరుణంలో, అధికారికంగా విడాకులు రాకముందే ఆయన తనను తాను ‘అవివాహితుడు’ అని ఎలా పేర్కొంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం క్లరికల్ తప్పిదమా? లేక కావాలనే అలా చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కెనీషా ఫ్రాన్సిస్‌తో అనుబంధం?

కెనీషా ఫ్రాన్సిస్ పేరు ఈ మధ్య కాలంలో రవి మోహన్ వ్యక్తిగత విషయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు ఆమెతో కలిసి సంయుక్తంగా ఆస్తి కొనుగోలు చేయడం అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచింది. ఇప్పటి వరకు ఈ వివాదంపై అటు రవి మోహన్ గానీ, ఇటు కెనీషా గానీ స్పందించలేదు. మౌనంగా ఉండటం వల్ల రకరకాల ఊహాగానాలకు ఆస్కారం ఇస్తోంది. వారి మధ్య బంధం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

►ALSO READ | Anirudh Wedding: ఐపీఎల్ బ్యూటీతో అనిరుధ్ పెళ్లి ఫిక్స్ అయిందా?.. హాట్ టాపిక్‌గా మారిన స్టార్స్ రిలేషన్!

కెరీర్ పరంగా ఫుల్ బిజీ!

వివాదాలు ఒకవైపు ఉన్నా, రవి మోహన్ తన ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రం జోరు చూపిస్తున్నారు. ఇటీవలే సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’ చిత్రంలో మెరిశారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘జీనీ’, ‘కరాటే బాబు’, ‘బ్రో కోడ్’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటన్నింటికీ మించి, యోగి బాబు ప్రధాన పాత్రలో ‘ఆన్ ఆర్డినరీ మ్యాన్’ అనే చిత్రంతో ఆయన మెగాఫోన్ పట్టి దర్శకుడిగా కూడా పరిచయం కాబోతున్నారు. గోవా ప్రాపర్టీ వ్యవహారంలో వస్తున్న విమర్శలకు రవి మోహన్ స్పందిస్తారో లేదో వేచి చూడాలి మరి.

 

©️ VIL Media Pvt Ltd.