Reading Time: < 1 minute

భర్త గోవా టూర్కు.. భార్య చుట్టాల గ్రామానికి.. దొంగలు ఇంట్లోకి..! మొయినాబాద్లో రూ.30 లక్షల బంగారం, 10 లక్షల నగదు చోరీ

Caption of Image.

భర్త స్నేహితులతో కలిసి గోవా విహారయాత్రకు వెళ్లాడు. ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేద్దామని భార్య తల్లిగారి ఊరికి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన దొంగలు.. ఇంట్లోకి ఎంటరై 30 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న మొయినాబాద్ మండలంలో జరిగింది ఈ భారీ చోరీ. 

శుక్రవారం (మార్చి 27) రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్దాపూర్ లో జరిగింది ఈ దొంగతనం. ఇంట్లో ఎవరు లేని వేళ తాళం పగలగొట్టి 40 లక్షల సొమ్మును ఎత్తుకెళ్లారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కోలా శ్రీనివాస్ (47) అనే వ్యక్తి మార్చి 23న గోవాకు వెళ్లాడు. ఆ తర్వాత 25న  అతని భార్య కోలా అనిత పిల్లలు బంధువుల ఇంటికి మంచిరేవులకు వెళ్లారు. 

ఇదే అదునుగా మార్చి 25న రాత్రి దొంగలు ఇంట్లో దూరి 16 తులాల 8 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, 10 లక్షల నగదు ను అపహరించారు. మార్చి 26న సాయంత్రం అనిత వచ్చి చూడగా.. తలుపులకు తాళం విరగొట్టి ఉండటంతో షాక్ కు గురైంది. లోపలకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండి, ఇల్లంతా చిందర వందరంగా ఉండటంతో వెంటనే తన భర్తకు ఫోన్ చేసింది. బీరువాలో ఉన్న  బంగారం,  వెండి,  నగదు మొత్తం కలిపి 40 లక్షల విలువైన సొమ్మ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.