Reading Time: < 1 minute

మూడు రాష్ట్రాల ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా

Caption of Image.
  •     కేరళ, అస్సాం, పుదుచ్చేరి బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ
  •     గోవాలోని పాండా ఉప ఎన్నికకు కూడా..

హైదరాబాద్, వెలుగు: కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. గోవాలోని పాండాఉప ఎన్నికకు కూడా రేవంత్ ను స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా శుక్రవారం మీడియాకు లేఖ విడుదల చేశారు. కేరళ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ తో పాటు రాష్ట్రం నుంచి మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. 

ఇక పుదుచ్చేరి ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కు చోటు దక్కింది.

©️ VIL Media Pvt Ltd.