Reading Time: < 1 minute
CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా (AM/NS ఇండియా) భారీ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. సోమవారం, మార్చి 23, 2026న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మొత్తం రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు, రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది. మొదటి దశలో 7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. 2029 నాటికి ఈ ప్లాంటును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా ?? ఈ రూల్స్ తెలుసా ??

Garikapati: గరికపాటి చెప్పిందేంటి ?? జనానికి అర్ధమైంది ఏంటి ??

జ్యోతిషం పేరుతో 58 మంది మహిళలపై అత్యాచారం

కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం

మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !