
మన తెలంగాణ/హైదరాబాద్: శివ పురాణంపై యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ రచించిన ‘రుద్ర’ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆదివారం ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని యువతకు చేరువ చేసేలా ఇలాంటి పుస్తకం రూపొందించడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి కొనియాడారు. నేటి తరానికి ఇలాంటి విలువైన గ్రంథాలు అవసరమని మెగాస్టార్ సుస్మితకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప రచనలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవికి మంత్రి సురేఖ కృతజ్ఞతలు తెలిపారు.