
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. నాలుగు ఓవర్లలో మూడు ప్రధాన వికెట్లు తీసి మ్యాచ్ భారత్ వైపుకు మలిపాడు. టి20 వరల్డ్ కప్ కోసం తీసుకున్న టీమీండియాలో సిరాజ్ కు అసలు చోటులేదు. హర్షిత్ రాణా గాయపడడంతో అతడిని జట్టులోకి తీసుకున్నారు. టీమిండియా 11లో సిరాజ్ చోటు దక్కుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి. అమెరికాతో జరిగే మ్యాచ్‌కు ముందు రోజు జస్ఫ్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్ సోకడంతో వెంటనే జట్టులోనికి ప్రధాన బౌలర్‌గా సిరాజ్‌ను తీసుకున్నారు. అమెరికాతో జరిగిన మ్యాచ్ అనంతరం సిరాజ్ మీడియాతో మాట్లాడారు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనకు ఫోన్ చేసి లగేజీ సర్దుకొని రమ్మని చెప్పాడు. సూర్య ఫ్రాంక్ చేస్తున్నాడని అనుకున్నాను. కానీ సూర్య గట్టిగా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ తిన్నాను. వెంటనే నమ్మాను, తాను వరల్డ్ కప్‌లో ఆడుతానని కలలో కూడా ఊహించలేదని, సొంత దేశంలో భారత్ తరపున టి20 వరల్డ్ కప్‌లో ఆడడం అనేది తన కల అని సిరాజ్ చెప్పాడు. రెండో టి20లో వాషింగ్టన్ సుందర్, బుమ్రా జట్టులోకి వస్తారు. అప్పుడు ఎవరిని పక్కకు పెడుతారు అనేది సమస్యగా మారింది. రింకు సింగ్‌కు బదులుగా వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకుంటారు. వాషింగ్టన్ సుందర్ స్పీన్ బౌలింగ్ చేస్తుండడంతో వరుణ్ చక్రవర్తి విశ్రాంతి ఇచ్చి ప్రధాన జట్లపై ఆడించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు సిరాజ్, బుమ్రా, అర్షదీప్ సింగ్‌తో పేస్ బౌలింగ్ తో భారత్ బరిలోకి దిగనుంది.