Reading Time: < 1 minute

యాచారం: రంగారెడ్డి యాచారం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెంకటేశ్వరతండాకు చెందిన జటావత్ హరియా(47) బైక్‌పై యాచారం మండలం కేంద్రంలోని గౌరెల్లి చౌరస్తా దగ్గర యూటర్న్ తీసుకుంటున్నాడు. దేవరకొండ డిపోకు చెందిన బస్సు వేగంగా వచ్చి హరియాను ఢీకొట్టింది. అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాచారం బస్టాఫ్ లేదని ఆర్‌టిసి డ్రైవర్ అతివేగంగా బస్సు నడిపాడని గ్రామస్థులు ఆరోపణలు చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయలేదని గ్రామస్థులు ఆందోళనకు దిగారు.