Reading Time: < 1 minute

ఖాట్మండు: నేపాల్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సునీల్ థాపా (68) గుండెపోటుతో మృతి చెందారు. శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం ఆయన గుండెపోటుకు గురి కావడంతో వెంటనే ఖాట్మండులోని థాపాతలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఉతయం 7.44 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

నేపాల్‌లోని డాంగ్‌లో జన్మించిన సునీల్ థాపా, సుమారు 40 ఏళ్లుకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. నేపాలీతో పాటు.. బాలీవుడ్, భోజ్‌పూరితో పాటు మొత్తం పలు భాషల్లో 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతి పట్ల నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కార్కీతో పాటు ‘మిరాయ్’ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సోషల్‌మీడియాలో సంతాపం తెలియజేశారు.