Reading Time: < 1 minute

కోల్‌కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో స్కాట్‌లాండ్ టాస్ గెలిచి విండీస్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ ఓపెనర్లు తొలి వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కెప్టెన్, కీపర్ హోప్‌ ఔట్ అయ్యాడు. ఈ దశలో హెట్మైర్ జట్టుకు అండగా నిలిచాడు. 36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 64 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఒక వెస్టిండీస్ బ్యాటింగ్‌లో కింగ్ 35, రూతర్‌ఫర్డ్ 26, పొవెల్ 24 పరుగులు చేశారు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరులు చేసింది. స్కాట్‌లాండ్ బౌలింగ్‌లో కూర్రీ 2, షరీఫ్, డేవిడ్‌సన్, లీస్క్ తలో వికెట్ తీశారు.