
కొన్ని సినిమాలు ఏ అంచనాలు లేకుండా విడుదలై.. సంచలనాలు సృష్టిస్తు ఉంటాయి. అలా వచ్చిన సినిమాల్లో ఒకటి అర్జున్ రెడ్డి. ఈ ఒక్క సినిమా హీరోగా విజయ్ కెరీర్‌ని, దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా కెరీర్‌ని మార్చేసింది. అయితే తాజాగా ‘అర్జున్ రెడ్డి’ స్టైల్‌లో ఓ సినిమా థియేటర్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆ సినిమానే ‘నిలవే’.
ఈ సినిమాకు సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూనే సాయి కె.వెన్నంతో కలిసి దర్శకత్వం వహించారు. శ్రేయాసి సేన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రాజ్ అల్లాడ, గిరిధర్‌రావు పోలాడి, సా కె.వెన్నం ఈ సినిమాను నిర్మించారు. వాలెంటైన్స్ డే కానుకగా ఈ సినిమాను ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్ శ్రేయాసి సేన్ అద్భుతంగా నటించిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.