
రాకింగ్ స్టార్ యశ్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. మార్చి 19న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. విడుదలకు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను రూ.120 కోట్ల (అడ్వాన్స్ ఆన్ కమీషన్ బేసిస్)కు సొంతం చేసుకోవటం ఇండస్ట్రీలో ఇది చర్చనీయాంశంగా మారింది. నాన్ తెలుగు సినిమాకు కోసం జరిగిన ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ డీల్‌గా మారింది. ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు మాట్లాడుతూ “కెజియఫ్ 2 తర్వాత స్టార్ హీరో యశ్ మార్కెట్ మరింతగా పెరిగింది. ఆయన తదుపరి సినిమా టాక్సిక్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక మూవీని మా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుండటం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు. యశ్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తున్నారు.