
హైదరాబాద్: తమ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు తగ్గాయని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి మాటలు విని మోసపోవద్దు అని సూచించారు. సంగారెడ్డి..ఇస్నాపూర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బిఆర్ఎస్ తరపున ప్రచారంలో భాగంగా.. మహిళలతో హరీశ్ రావు మాట్లాడారు. మంచి నీళ్లు ఇవ్వలేని సిఎంకు ఓటు అడిగే హక్కులేదని విమర్శించారు. సిగాచీ పరిశ్రమ ఘటన జరిగిన వెంటనే తామే ముందు వెళ్లామని, కోర్టులో కేసు వేసి బాధితుల తరపున కొట్లాడుతున్నానని తెలియజేశారు. సిగాచీ బాధితులకు సిఎం రూ.కోటి ఇప్పిస్తానని ఇప్పించలేదని, సిగాజీ బాధితులకు సిఎం కోటి ఇప్పిస్తే తాను రాజీనామా చేస్తానని హరీశ్ రావు సవాల్ విసిరారు.