Reading Time: < 1 minute

హరారే: అండర్‌-19 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. హరారే వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ అండర్-19 జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో ఓపెనర్ ఆరోన్ జార్జ్(9) బెన్ మేయర్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 6 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజ్‌లో వైభవ్ సూర్యవంశీ(22), ఆయుశ్ మాత్రే (0) ఉన్నారు.