
తనదైన స్టైల్ కామెడీతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి. నవీన్ నటించిన సినిమాలు చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ అలరిస్తాయి. కాగా, నవీన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న విడుదలైంది. గోదావరి నేపథ్యంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ పండగ సినిమా అనిపించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100+ కోట్లు వసూళ్లు సాధించింది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించగా.. చమ్మక్ చంద్ర, బుల్లిరాజు (రేవంత్), రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. థియేటర్‌లో అభిమానులతో నవ్వులు పూయించిన ఈ సినిమా ఇప్పుడు ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 11న ఈ సినిమా ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూస్తామా అని ఎదురుచూస్తున్నారు.