Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిప ల్ ఎన్నికల కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్లను నియమించింది. ఈ ని యామకంలో భాగంగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు సైతం ఇందులో అవకాశం క ల్పించడం విశేషం. అనర్హత కేసులో స్పీ కర్ ఈ మధ్య క్లీన్‌చిట్ ఇచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండడం విశేషం. నిజామాబాద్ కార్పొరేషన్ కోఆర్డినేటర్‌గా శేరిలింగంపల్లి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించగా ఇల్లందు మున్సిపాలిటీకి భద్రాచలం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును, షాద్‌నగర్ మున్సిపాలిటీకి రాజేంద్రనగర్ బిఆర్‌ఎస్ ఎమ్మె ల్యే ప్రకాశ్‌గౌడ్‌లను నియమిస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇ ప్పటికే పలువురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ వద్ద అనర్హత కేసు పెండింగ్‌లో ఉండగానే ప్రస్తుతం విచి త్రం చోటుచేసుకోవడం విశేషం. ఇప్పటికే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీ న్‌చిట్ ఇవ్వడం తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ కోఆర్డినేటర్స్‌లను నియమించారు.

నిజామాబాద్ కార్పొరేషన్‌కు నలుగురు కో ఆర్డినేటర్‌లను పిసిసి అధ్యక్షుడు నియమించారు. దీంతోపాటు ఆదిలాబాద్‌కు ఆరుగురు, పెద్దపల్లికి 10 మంది, కరీంనగర్‌కు ఏడుగురు, మెదక్‌కు 13 మంది, జహీరాబాద్‌కు 8 మంది, మల్కాజిగిరికి ముగ్గురు, భువనగిరికి 11 మంది, చేవెళ్లకు 6 మంది, మహబూబ్‌నగర్‌కు 11 మంది, నాగర్‌కర్నూల్‌కు 11 మంది, నల్లగొండ 10 మంది, వరంగల్‌కు నలుగురు, మహబూబాబాద్‌కు ఎనిమిది మంది, ఖమ్మంకు ఏడుగురి నియమించారు. ఇందులో కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే మంత్రులకు ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పగించింది. క్షేత్ర స్థాయిలో నేతలతో సమన్వయం చేసుకునేందుకు కాంగ్రెస్ కో ఆర్డినేటర్లను నియమించింది. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11వ తేదీన జరుగనుండగా 13వ తేదీన ఫలితాలు రానున్నాయి.