
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభు త్వం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధు ల విడుదలకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈ మేరకు రాష్ట్రానికి తొలి విడతగా రూ. 259.36కోట్లు విడుదల చేసింది. ఇది రాష్ట్ర గ్రామ పంచాయతీలకు ఊరటనిచ్చే పరిణా మం. ఎన్నికల జాప్యం కారణంగా రెండేళ్లుగా నిధులు నిలిచిపోయాయి. 2024 నుంచి 20-25, 2025 నుంచి 20-26 ఆర్థిక సంవత్సరాలకు సం బంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల గత రెండేళ్లుగా ఆగిపోయాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం, దానిపై వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు కారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో ఈ నిధుల విడుదలకు కూడా జాప్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తరువాతే పెండింగ్ నిధులు విడుదల చేస్తామని స్పష్టంగా ప్రకటించింది. ఎన్నికలు లేని పరిస్థితిలో నిధుల విడుదల సాధ్యం కాదన్న కేంద్ర వైఖరి కారణంగా గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కాగా కేంద్ర పెద్దలతో రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మంత్రి సీతక్క పలు దఫాలుగా విజ్ఞప్తులు చేశారు.
గ్రా మ పంచాయతీల ఆర్థిక ఇబ్బందులను దృష్టి లో ఉంచుకొని మంత్రి సీతక్క ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు ఇతర కేంద్ర పెద్దలను పలు దఫాలు ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురు కావడం , ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 31 లోపు నిధులు విడుదల కాకపోతే నిధులు శాశ్వతంగా రద్దు అయ్యే ప్రమాదం ఉండటంతో ప్రక్రియను వేగవంతం చేశారు. సంబంధిత శాఖ అధికారులతో పలుసార్లు సమీక్షలు నిర్వహించి నిధులు తీసుకువచ్చే దిశలో దిశా నిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. కేంద్ర శాఖలతో నిరంతర సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్, ఇతర అధికారులు కూడా నిరంతరంగా కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి నిధుల విడుదలకు కృషి చేశారు. ఈ ప్రయత్నాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది.