
మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో : రాష్ట్రంలో ఏ పనులు కావాలన్నా, బిల్లులు కావాలన్నా ఆర్‌ఆర్ ట్యాక్సి కట్టాల్సిన దుస్థితి నెలకొందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఆర్ అంటే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు కమీషన్లతో దోపిడికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అంటే కమీషన్ రాజు, ల్యాండ్ మాఫియా, దోపిడి…ఇలాంటి కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు.మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎంఎవిఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో విజయ సంకల్ప సమేళనం సందర్భంగా ముఖ్యకార్యకర్తల జరిగింది. తెలంగాణ ప్రాంతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కొన్ని వర్గాలను బుజ్జగించేదానికి కొన్ని వర్గాలను సంతృప్తి పర్చేదానికి కొన్ని వ్యాఖ్యలు చేశారన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లింలని, ముస్లింలంటే కాంగ్రెస్ అంటూ తమ వాదాన్ని వినిపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణా సంసృతిని సాంప్రదాయాన్ని పూర్తిగా విస్మరించి సనాతన దర్మాన్ని గాయపర్చే విధంగా కేవలం ఒక వర్గాన్ని ,మైనార్టీ వర్గాన్ని సంతృప్తి పర్చుతున్నాడో తెలంగాణ ప్రజాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింలను సంతృప్తి పర్చేండంలో పరాకాష్టకు చేరాడన్నారు. ఎస్‌సి,ఎస్‌టి,బిసిలకు సంబందించిన సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపుల్లో తగ్గించి మైనార్టీలకు అధిక బడ్జెట్ కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు.
ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ పడుతున్న తాపత్రయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడి వక్‌బోర్డు సవరించాలని బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఏరకంగా వ్యతిరేకిచిందో తెలుసుకోవాలని కోరారు. రాష్ట్రంలో లక్షల రూపాయలు విలువ చేసే 77 వేల ఎకరాలు వక్ బోర్డు భూములను అప్పగించారని ఆరోపించారు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో హిందూ దేవాలయపై దాడులు జరుగుతున్నా నోరు మెదపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన విద్వంసం కాని గాందీనగర్ దేవాలయంను అపవిత్రం చేసిన సంఘటనలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహించి హిందూ మనో భావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం దారుమణివ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలన్ని చూస్తుంటే సనాతన ధర్మాని ఎలా నాశనం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. ఈ దేశానికి సనాతన ధర్మమే ఒక గుర్తింపు, ఒక ఆత్మ అని, అలాంటి ఆత్మమీద దాడి జరిగితే బిజెపి కార్యకర్తలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోది మహిళా సంక్షేమం కోసం,వారి అభ్యున్యతి కోసం, నారి శక్తి పేరుమీద అనేక కార్యక్రమాలు తీసుకుంటుంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందన్నారు. మహిళలకు రూ.2500, కళ్యాణ లక్ష్మి పేరు మీద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని మహిళలకు మోసం చేసిందని ఆరోపించారు.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవ చేశారు. మహిళలకు జరిగిన అన్యాయంపై కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మహిళలకే కాకుండా సమాజంలో ఉన్న రైతులతో పాటు బడుగు బలహీన వర్గాలతో పాటు ఓబిసి ప్రజలను దగా చేస్తోందని విమర్శించారు. రైతులకు రైతు భరోసా కింద ఇస్తామన్న రూ. 15 వేలు, భూమి లేని రైతులకు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఎస్‌సిలను,ఆదివాసులను మోసం చేసిన ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ప్రధాని నరేంద్ర మోది తెలంగాణను అభివృద్ది చేసే విధంగా బడ్జెట్‌లో నిధులు పెద్ద ఎత్తున విడుదల చేశారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రైల్వేకు రూ- 5400 కోట్లు కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి పూణే,హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగుళూరు కు మూడు హైస్పీడ్ రైళ్ల క్యారిడార్లను తెలంగాణకు ఇచ్చారంటే తెలంగాణపై ప్రధానికి ఎంత ప్రేమె ఉందో తెలుసుకోవాలని కోరారు. ఫార్మరంగంతో పాటు పారిశ్రామిక రంగాలతో పాటు చివరికి నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు,మెగా టెక్స్‌టైల్స్ పరిశ్రమ,హైదరాబాద్ నాగపూర్ కారిడార్ ,హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రీ కారిడార్ వంటి ఎన్నో అభివృద్ది పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోది నాయకత్వం పట్ల ఆదరణ పెరుగుతోందని అన్నారు.
మదర్ ఆఫ్ దీస్ పేరుతో నరేంద్ర మోది ప్రభుత్వం యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందం చేసుకొని దేశాభివృద్ది కోసం పాటుపడుతోందని అన్నారు. అమెరికా అనేక ఆంక్షలు విధించినప్పటికి, అమెరికా కూడా దిగివచ్చి ఇవాల 18 శాతం సుంకాన్ని తగ్గించిందంటే అది ప్రధాని నరేంద్ర మోది పరిపాలన తీరుకు నిదర్శమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 35 శాతం ఓటింగ్ శాతం వస్తే ఈ ఎన్నికల్లో తప్పకుండా బూతు లెవల్లో 50 శాతం ఓటింగ్ పెంచే విధంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బిజెపి విజయ దుందిబి మోగించిందని కొనియాడారు. మహారాష్ట్రతో పాటు అరుణాచల ప్రదేశ్, బీహార్,కేరళలోని తిరుపనంతపురం , గోవ,చండీగడ్ ఎన్నికల్లో ప్రజలు బిజెపిని గెలిపిస్తున్నారంటే అది ప్రధానిపై ప్రజలకున్న విశ్వాసమని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉన్న కళలు, పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకు గెలుపు దిశగా బిజెపి పయనిస్తోందన్నారు. యువనాయకత్వాన్ని పార్టీ ప్రోత్సహించేందుకు పార్టీ ముందు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, లక్షణ్, ఎంపి డికె అరుణ, రాష్ట్ర నాయకులు శాంతికుమార్, ఆచారి, పద్మాజారెడ్డి, రాములు, గువ్వల బాలరాజు, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.